Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 25 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 25 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 25 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | ఏకాదశి - 29:12:12 (నవంబర్ 26, 2020 05:12:12)వరకు తరువాత ద్వాదశి | ఉత్తరాభాద్ర నక్షత్రం - 18:20:33 తదుపరి రేవతి | వర్జ్యం 11:40:47 నుండి 12:25:38 | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం 11:40:47 నుండి 12:25:38 | రాహుకాలం 12:03:13 నుండి 13:27:19 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశిఫలాలు

మేషం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆప్తుల సలహాలు పాటిస్తారు. అనుకున్న పనుల్లో విజయం. స్థిరాస్తి వృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

తుల: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అవాంతరాలు.

ధనుస్సు: రుణాలు తీరుస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

మకరం: వ్యవహారాలలో విజయం. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరా లు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం.

Show Full Article
Print Article
Next Story
More Stories