Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశివారికి అనుకోని ఖర్చులు

Today Rashiphalalu
x

ఈ రోజు రాశి ఫ‌లాలు

Highlights

Daily Horoscope: ఈ రోజు వివిధ రాశుల వారి రాశిఫ‌లాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగ‌ళ‌వారం, ఉత్తరాయణం| వ‌సంత ఋతువు, వైశాఖ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.023| తిథి శు.చ‌తుర్థ‌శి రా.గం.07.52వరకు | తదుపరి పౌర్ణ‌మి |నక్షత్రం స్వాతి ఉ.6.00 వరకు| తదుపరి విశాఖ‌|రాహుకాలం : ప‌. 3,00 నుంచి 4.30 వరకు | యమగండం ఉ.09.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం ప‌.11.13 నుంచి 12.43 వరకు| దుర్ముహూర్తం ఉ.08.03 నుంచి 8.57 పున: రా 10.50 నుంచి రా.11.45 వరకు| అమృతఘడియలు రా.08.18 నుంచి 9.40 వ‌ర‌కు

ఈ రోజు రాశి ఫ‌లాలు

మేషం: పనులలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. దైవదర్శనాలు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా కొనసాగుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో చికాకులు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

వృశ్చికం: పనులలో జాప్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: జీవితాశయం నెరవేరుతుంది. దైవదర్శనాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: ఆర్థిక విషయాలు అంతంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

Show Full Article
Print Article
Next Story
More Stories