Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 25 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 25 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 25 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | ఏకాదశి - 25:55:59 (డిసెంబర్ 26 తె.01:55:29) వరకు తదుపరి ద్వాదశి | అశ్వని నక్షత్రం - 07:36:31 వరకు తదుపరి భరణి | వర్జ్యం 08:56:44 నుండి 09:41:07 వరకు | అమృత ఘడియలు 11:54:16 నుండి 12:38:39 వరకు | దుర్ముహూర్తం 08:56:44 నుండి 09:41:07, 12:38:39 నుండి 13:23:02 వరకు | రాహుకాలం 10:53:15 నుండి 12:16:28 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

సింహం: అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం.

కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. చేపట్టిన పనుల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.

కుంభం: అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

మీనం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories