Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 24 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 24 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. పురస్కారాలు అందుతాయి.

సింహం: అందరిలోనూ గుర్తింపు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానా లు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కన్య: పనులలో మరింత పురోగతి. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.

వృశ్చికం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత ఉంటుంది.

కుంభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

మీనం: ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమకు ఫలితం అంతంత మాత్రమే. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

Show Full Article
Print Article
Next Story
More Stories