Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 24 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 24 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 24 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి ఉ.11-25 వరకు తదుపరి నవమి | ఉత్తరాషాఢ నక్షత్రం ఉ.06-36 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం: ఉ.10-39 నుంచి 12-16 వరకు | అమృత ఘడియలు రా.08-21 నుంచి 09-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-59 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

వృషభం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.

మిథునం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. కళాకారులకు సత్కారాలు.

కన్య: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. శుభవార్తలు వింటారు. ధన, వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత..

మీనం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం

Show Full Article
Print Article
Next Story
More Stories