Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 24 May 2021 5:51 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 24th May
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పనిప్రదేశంలో అనుకూల మార్పులు ఉంటాయి. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. మీ మంచి ప్రవర్తనలో వాతావరణాన్ని సానుకూలపరుస్తారు. రాత్రి సమయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ నిర్లక్ష్యం కారణంగా డబ్బు ఖర్చు అవుతుంది. సాయంత్రం సమయంలో చాలాకాలంగా ఎదురుచూస్తోన్న అతిథి రాక ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుభకార్యక్రమాలను చేరడం ద్వారా గౌరవం పెరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు తల్లి దండ్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు చాలా బిజీగా జీవితాన్ని గడుపుతారు. కానీ ప్రయోజనాలు అంతగా కనిపించడం లేదు. సాయంత్రం సమయంలో వాహనాల విషయంలో జాగ్రత్తగా వుండడం అవసరం. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రాశివారికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. మనోభావంతో తీసుకున్న ఏదైనా నిర్ణయాలు మీకు తప్పు అని నిరూపించవచ్చు. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఈ రోజు మీరు ఏ పోటీలోనైనా విజయానికి సంబంధించిన వార్తలను పొందవచ్చు. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. రాత్రి సమయంలో కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సృజనాత్మక పనుల్లో మీకు విజయం లభిస్తుంది. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోండి. గృహస్థుల సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రభుత్వశాఖలో కొంత పనిచేయడంలో విజయం లభిస్తుంది.

తులా రాశి: ఈ రాశివారు ఈ రోజు నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ మాటలతో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు, శ్రేయస్సు లభిస్తుంది. ఈ రోజు మీలో ఒకరి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈ రోజు ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. మీకిష్టమైనవారిని కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ కోపంపై నియంత్రణ కలిగి ఉండండి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు ఇంటి అవసరాలకు డబ్బు ఖర్చు అవుతుంది. ప్రాపంచీక ఆనందాలు పెరుగుతాయి. కార్యాలయం, సహోద్యోగులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ కారణంగా రోజంతా ఒత్తిడిలో గడుపుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపార రంగంలో విజయం సాధించడం ద్వారా ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెద్ద మార్పులు చేయడానికి ప్లాన్ చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు జీవిత భాగస్వామి అనారోగ్యం బారిన పడే అవకాశముంది. ఈ కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో చట్టబద్దమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో తల్లిదండ్రుల సలహా తీసుకుని ముందుకు సాగితే ప్రయోజనాలు వుంటాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సామాజిక దూరం పాటించాలి. వ్యాపారంలో పురోగతి కారణంగా మనస్సు ఆనందంగా ఉంటుంది విద్యార్థులపై భారం తొలుగుతుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story