Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 24 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 24 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 24 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | దశమి - 23:19:01 వరకు తదుపరి ఏకాదశి | అశ్వని నక్షత్రం - పూర్తిగా తదుపరి భరణి | వర్జ్యం 110:25:02 నుండి 11:09:24 వరకు | అమృత ఘడియలు 11:53:47 నుండి 12:38:09 వరకు | దుర్ముహూర్తం 10:25:02 నుండి 11:09:24, 14:51:17 నుండి 15:35:40 వరకు | రాహుకాలం 13:39:10 నుండి 15:02:23 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. సోదరులతో వివాదాలు తీరతాయి. వాహన యోగం. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కుంభం: ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. యత్నకార్యసిద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

Show Full Article
Print Article
Next Story
More Stories