Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 24 April 2021 6:25 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 24th April
X

Todays Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. మితిమీరిన ఖర్చుకు కళ్లెం వేయాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సొంతం అవుతాయి. దుర్గాస్తుతి పఠించడం మంచిది.

మిథునం: బంగారు భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేసే సమయమిది. తలచిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. అవరోధాలు తొలగుతాయి. దగ్గరవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. దేనికీ తొందరవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదేవతాస్మరణ మంచిది.

కర్కాటకం: ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది.తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

సింహం: కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

కన్య: ప్రారంభించే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

తుల: మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు చాలా బాగుంటుంది. ఆర్థికంగా పరవాలేదు. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

వృశ్చికం: చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

ధనుస్సు: లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు అర్జిస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి.

మకరం: చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగులేని విజయాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. విష్ణుమూర్తి ఆరాధన శ్రేయస్సునిస్తుంది.

కుంభం: ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

మీనం: శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఖర్చులు తగ్గించుకోవాలి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story