Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు

Sandeep Reddy
Updated on: 24 Oct 2021 12:42 PM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 24 October 2021
X

Representation Photo

ఈరోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు; ఆశ్వయుజ మాసం;బహుళపక్షం చవితి: రా. 2.21 తదుపరి పంచమి రోహిణి: రా. 11.07 తదుపరి మృగశిర వర్జ్యం: మ. 2.15 నుంచి 4.01 వరకు తిరిగి తె.వ. 5.19 నుంచి అమృత ఘడియలు: రా.7.34 నుంచి 9.20 వరకు; దుర్ముహూర్తం: సా. 3.58 నుంచి 4.44 వరకు; రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు; సూర్యోదయం: ఉ.5-59, సూర్యాస్తమయం: సా.5-31 సంకష్ట హర చతుర్థి

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ధనం కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకుండా ఉండడమే మంచింది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వుండాలి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో వాదనలకు దిగి కష్టాలు తెచ్చుకోద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరాశి వారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొనే అవకాశాలు ఉంటాయి.

కన్యా రాశి: ఈరాశి వారికి ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నష్టపోతారు.

తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు . ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పురోభివృద్ది కనపడుతోంది. అధికారులనుండి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తికి సంబంధించి మీ కలలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. కొన్ని అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతాయి. అనవసర ఖర్చులకు దూరంగా వుండండి. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభ రాశి: ఈ రాశివారు వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద లాభాలు పొందే అవకాశముంది. రోజువారీ పనులకు మించి కొత్తదనాన్ని ప్రయత్నించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఉంటాయి. కొందరు తమ కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులను కష్టపడి పూర్తి చేసుకుంటారు. దీని వల్ల రోజంతా లాభావకాశాలు ఉంటాయి. మీ కుటుంబం శాంతి, స్థిరత్వాన్ని పొందుతారు. మీరు ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధువులు, పొరుగువారి సమస్యలను పరిష్కరించడంలో మీ సహాయం తీసుకుంటారు. సాయంత్రం సమయంలో స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Sandeep Reddy

Sandeep Reddy

Next Story