Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 23 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 23 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 23 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | నవమి - 24:34:32 వరకు తదుపరి దశమి | శతభిష నక్షత్రం - 13:05:20 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 08:40:26 నుండి 09:25:22 | అమృత ఘడియలు 11:40:09 నుండి 12:25:04 | దుర్ముహూర్తం 12:25:04 నుండి 13:10:00, 14:39:51 నుండి 15:24:47 | రాహుకాలం 07:49:54 నుండి 09:14:08 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశిఫలాలు

మేషం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుం ది. వస్తులాభాలు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.

వృషభం: నిర్ణయాలు మార్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: వ్యయప్రయాసలు ఉండవచ్చు. అనుకున్న పనుల్లో స్వల్ప అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో పురోగతి. వస్తు, ధనలాభాలు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరపు బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. విందువినోదాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories