Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 22 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 22 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరపతి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మోయాల్సివస్తుంది.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పా తబాకీలు కౌన్ని వసూలవుతాయి. నూత న ఉద్యోగప్రాప్తి. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉ ద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం, వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం.. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలమైన పరిణామాలు. సంఘంలో గౌరవం.

మకరం: కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: రుణాలు చేస్తారు. పనుల్లో మరింత జాప్యం. బంధు,మిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

మీనం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా.

Show Full Article
Print Article
Next Story
More Stories