Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి ఏ పని ప్రారంభించినా అందులో విజయాలు సాధిస్తారు

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 22 Jun 2021 6:03 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 22nd June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం:5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు కోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో వున్న కేసులు పూర్తి అవుతాయి. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ప్రదేశంలో అందరితో కలివిడిగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంతో ఏ పని చేసిన కచ్చితంగా విజయం లభిస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారం విషయంలో ఒప్పందం కుదుర్చుకునే ముందు దర్యాప్తు చేయడం అవసరం. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు ఏ పని చేసిన కచ్చితంగా విజయం లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత అన్ని పనులు పూర్తవుతాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారం విషయంలో ఒప్పందం కుదుర్చుకునే ముందు దర్యాప్తు చేయడం అవసరం. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఏదైనా మేధోపరమైన పనిలో విజయం సాధించవచ్చు. విజయం కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపార పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి వస్తే కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదోన్నతులు లేదా జీతం పెంపు కూడా ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు ఎవరికైనా రుణాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు ఎదురౌతాయి. మీరు మీ అభిరుచిని కొనసాగించడం గురించి ఆలోచిస్తారు. మీరు కూడా దీని ద్వారా కొంత డబ్బు సంపాదించవచ్చు.స్నేహితుడు రుణం అడిగితే మీ స్థానాన్ని స్పష్టంగా చెప్పండి. భావోద్వేగానికి దూరంగా ఉండండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

తులా రాశి: ఈరాశి వారికి మీరు ప్రతి పనిలో విజయం పొందుతారుు. వ్యాపారంలో వృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. గుండె, మనస్సు సమతూల్యత విజయానికి దారితీస్తుంది. మీ సిబ్బందిపై నిఘా ఉంచండి. మీ ప్రవర్తనతో మీరు వారి హృదయాలను గెలుచుకోగలుగుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రతిసారి డబ్బు ప్రయోజనాలు అందుకుంటారు. ఈ రోజు ఎవరితోనైనా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.

ధనస్సు రాశి: ఈ రాశివారు మీరు ఆఫీసులో చాలా పని చేయాల్సి ఉంటుంది. అనంతరం కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు. మీ ప్రతిభపై నమ్మకాన్ని ఉంచండి. మీకిష్టమైన వారి మానసిక స్థితి ఈ రోజు చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు అధిక వ్యయం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ పనులను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించడం ప్రారంభిస్తే చివరకు మీకు సంతృప్తి లభిస్తుంది. చట్టపరమైన పత్రాలపై సంతకం చేసేముందు జాగ్రత్తగా చదవడం అవసరం. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. రోజులో ఎక్కువ భాగం ఇంటి పనులు నిర్వహించడానికే ఖర్చు చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి కార్యాలయంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.పనిలో వచ్చే అడ్డంకులు తొలగించబడతాయి. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు వున్నాయి. ఆర్థిక విషయాలను ఎవ్వరితో చర్చించవద్దు. విజయానికి అవకాశాలు ఎక్కువ. నూతన వ్యక్తులతో సంబంధాలు, పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఒప్పందాన్ని ఖరారు చేసే పనిని కొంతకాలం వాయిదా వేయవచ్చు. కార్యాలయంలో మీకు తగిన బాధ్యతలు ఉంటాయి. తెలివికి సంబంధించి పని ఫలితాలు పొందుతారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story