Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి సంఘంలో గౌరవం!!

Today Horoscope
X

రాశిఫలాలు 

Highlights

Daily Horocope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 22 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | నవమి - 18:30:43 వరకు తదుపరి దశమి | భరణి నక్షత్రం - 18:40:17 వరకు తదుపరి కృతిక | వర్జ్యం 09:04:55 నుండి 09:49:59 వరకు | అమృత ఘడియలు 12:05:11 నుండి 12:50:16 వరకు | దుర్ముహూర్తం 09:04:55 నుండి 09:49:59, 12:50:16 నుండి 13:35:20 వరకు | రాహుకాలం 11:03:13 నుండి 12:27:43 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వస్తులాభాలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. కీలక నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: కొన్ని పనులు సమయానికి పూర్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: ఇంటర్వ్యూలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

Web TitleDaily horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 22nd January
Next Story