Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 22 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

K V D Varma
Published on: 22 Aug 2020 7:24 AM IST
Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 22 పంచాంగం, దినఫలాలు!
X

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

ఈరోజు రాశి ఫలాలు

మేషం:అనుకోని విధంగా రాబడి. పదవుల్లో ఉన్న వారితో పరిచయాలు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

వృషభం:ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

మిథునం:కొత్త పనులు చేపడతారు. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. ఆస్తిలాభం. ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు అధిగమిస్తారు. విందువినోదాలు.

కర్కాటకం:కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఇంటిలో శుభకార్యాలు. ధనలబ్ధి. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి.

సింహం:రుణాలు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. బంధువర్గంతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. నిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు.

కన్య:ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

తుల:శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. పలుకుబడి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యల నుంచి ఊరట.

వృశ్చికం:కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ప్రగతి. భూలాభాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. విందువినోదాలలో పాల్గొంటారు.

ధనుస్సు:ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో నిరుత్సాహం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం:వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. సోదరులతో తగాదాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. నిరుద్యోగులకు మరింత శ్రమ. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు.

కుంభం:ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు

మీనం:కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి

K V D Varma

K V D Varma

Next Story