Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 22 April 2021 6:17 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 22nd April
X

Todays Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| గురువారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం. కొన్ని వ్యవహారాల్లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

వృషభం: శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.

మిథునం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్ని విధాలా మంచిది.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువివ్వడం వల్ల ఇంట గెలుస్తారు. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం: బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

కన్య: మీమీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు.

తుల: చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది.

వృశ్చికం: మనోధైర్యంతో ముందుకు సాగి పనులు పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు.

ధనుస్సు: శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరు.ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.

మకరం: మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

కుంభం: పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి.

మీనం:ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story