Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 21 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 21 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు రాశి ఫలాలు

మేషం: శ్రమాధిక్యం. కొన్ని పనులలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఆరోగ్యభంగం.

వృషభం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని చర్చలు మధ్యలో నిలిపివేస్తారు. వృత్తి,వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం. పనులలో కొంత జాప్యం.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందుకు సాగుతారు. విందువినోదాలు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.. వ్యాపార, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు ప్రయత్నాలు మందగిస్తాయి.

కన్య: యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. శుభవార్తలు అందుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు.

తుల: దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆస్తి వివాదాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

ధనుస్సు: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. వాహనయోగం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో సమర్థత చాటుకుంటారు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. బంధు మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories