Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 21 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 21 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 21 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | సప్తమి - 21:50:30 వరకు తదుపరి నవమి | శ్రావణ - 09:53:52 వరకు తదుపరి ధనిష్ట | వర్జ్యం 06:24:31 నుండి 07:48:55 | అమృత ఘడియలు 11:39:34 నుండి 12:24:34 | దుర్ముహూర్తం 06:24:31 నుండి 07:09:32, 07:09:32 నుండి 07:54:32 | రాహుకాలం 09:13:18 నుండి 10:37:41 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులు ఒత్తిళ్లు పెంచుతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: కొత్త పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పరిస్థితులు అనుకూలించవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: పరిచయాలు పెరుగుతాయి. కొత్త పదవులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కుంభం: మిత్రులతో సఖ్యత. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వ్యవహారాలలో సమస్య లు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories