Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు!!

Today Horoscope
X
ఈరోజు రాశిఫలాలు
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | అష్టమి - 15:51:45 వరకు తదుపరి నవమి | అశ్వని నక్షత్రం - 15:36:32 వరకు తదుపరి భరణి | వర్జ్యం 10:34:53 నుండి 11:19:55 వరకు | అమృత ఘడియలు 12:04:56 నుండి 12:49:58 వరకు | దుర్ముహూర్తం 10:34:53 నుండి 11:19:55, 15:05:03 నుండి 15:50:05 వరకు | రాహుకాలం 13:51:53 నుండి 15:16:18 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సన్నిహితులతో మరింత సఖ్యత. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది..

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు..

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబంలో స్వల్ప చికాకులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: కుటుంబసభ్యులతో విరోధాలు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: పనుల్లో కొంత అనుకూలత. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనులు నిరుత్సాహపరుసర్శ్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి..

ధనుస్సు: ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. పనులలో ఆటంకాలు. దైవదర్శనాలు. నిర్ణయాలు వాయిదా. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం: చేపట్టిన పనులు పూర్తి. అందరిలోనూ విశేష గౌరవం. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.

కుంభం: కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు..

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

Web TitleDaily horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 21st January
Next Story