Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 21 April 2021 6:27 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 21st April
X

Todays Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| బుధవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 67 శాతం మద్దతు ఇస్తుంది.

వృషభం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాత్రి సమయంలో కొంతమంది అసహ్యకరమైన వ్యక్తులకు కలవడం వల్ల మీరు బాధపడతారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంకటహర గణపతి స్తోత్రము పఠించడం మంచిది.

మిథునం: మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. పిల్లల చదువులో ఆశించిన విజయాన్ని అందుకోవడం మీకు ఆనందకరంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

కర్కాటకం: ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. గణపతి స్తోత్రం పఠించడం మంచిది

సింహం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రతి పనిలోనూ, వ్యవహారంలోనూ మీరు విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఈ రోజు మీ ఖ్యాతి పెరుగుతుంది. పిల్లల బాధ్యత నెరవేరుతుంది.

కన్య: చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీల సమస్యలను పరిష్కరించుకుంటారు. లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందుకునే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనూహ్య విజయాలు పొందుతారు. సంతానం వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం పెరుగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.

తుల: అనుకున్న ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అరుగుదల సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది

వృశ్చికం: ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతర్గత రుగ్మతలు, అనారోగ్యాలు మిమ్మల్ని బాధిస్తాయి. ఆరోగ్యం విషయంలో మీకు ప్రయోజనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు: కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. అధికార పార్టీ నుంచి ప్రయోజనకరంగా పొందవచ్చు. అత్తమామల వైపు నుంచి తగినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మకరం: తలపెట్టిన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. ఉపాధి రంగంలో నూతన ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కుంభం: శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. సామాజిక దూరాన్ని పాటించడం ముఖ్యం. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరీక్ష చేయించుకుంటే మంచిది. అనవసర విషయాలను పొడిగించకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మీనం: స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. వైవాహిక జీవితంలో చాలా రోజుల ప్రతిష్టంభను అంతం చేస్తుంది. కుుటంబంలో ఆనందం ఉంటుంది. బావ, బావమరిదితో సంబంధం చెడిపోయే ప్రమాదముంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story