Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 20 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 20 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 20 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ: ఉ.10-07 వరకు తదుపరి చవితి | చిత్త నక్షత్రం ఉ.6-20 వరకు స్వాతినక్షత్రం తె.4-41వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: ఉ.11-32 నుంచి 1-01 వరకు | అమృత ఘడియలు: రా.8-28 నుంచి 9-58 వరకు | దుర్ముహూర్తం: సా.4-20 నుంచి 5-08 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు రాశి ఫలాలు

మేషం: చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

వృషభం: కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగే సమయం.

కన్య: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలబ్ధి. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

దనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

మకరం: ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

కుంభం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: సన్నిహితులతో వివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. బంధువులతో చర్చలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

Show Full Article
Print Article
Next Story
More Stories