Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 20 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 20 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 20 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | షష్టి - 21:31:45 వరకు తదుపరి సప్తమి | ఉత్తరాషాఢ నక్షత్రం - 09:22:47 వరకు తదుపరి శ్రవణ | వర్జ్యం 07:48:25 నుండి 09:12:53 | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం 08:39:06 నుండి 09:24:08, 12:24:19 నుండి 13:09:22 | రాహుకాలం 10:37:20 నుండి 12:01:48 | సూర్యోదయం: ఉ.06-23 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

వృషభం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మిథునం: నూతన వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలు సానుకూలం. వస్తు, వస్త్రలాభాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: పనుల్లో స్తబ్ధత. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అయోమయస్థితి.

తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. మిత్రులతో సఖ్యత. కొన్ని వివాదాలు సద్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

వృశ్చికం: ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువర్గంతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు. బం«ధువులతో తగాదాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అసంతృప్తి.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మీనం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుముడులు వీడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories