Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి ఏ పని ప్రారంభించినా అందులో విజయాలు సాధిస్తారు

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 20 Jun 2021 5:59 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 20th June
X

Daily Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో పని చేసి సులభంగా విజయాలను అందుకుంటారు. ఖర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే తనకోసమే తన శత్రువు అన్నట్లు కోపాన్ని నియంత్రించుకోవాలి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు విదేశీ వస్తువుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. కార్యాలయం లేదా ఇంట్లో మార్పులు ఉండవచ్చు. సమాజంలో పేరు, ప్రఖ్యాతులు, గౌరవం పొందుతారు. సోమరితనంతో ఉంటారు.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు మనస్సులో కోపం, ద్వేషం కారణంగా మీకిష్టమైన వ్యక్తి నుంచి దూరం ఉండవచ్చు. ఉదయం నుంచి బయటకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. మధ్యాహ్నం నుంచి చాలా వరకు వినోదంలో సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో ఎవ్వరితోనూ గొడవలు పడకండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విదేశీ వస్తువుల వ్యాపారంలో పెట్టుబడులు భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారికి సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యక్రమానికి లేదా పర్యాటకానికి వెళ్లే అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో ప్రత్యర్థిపై చేసిన విమర్శలపై శ్రద్ధ చూపకుండా మీ పని మీరు చేయండి. తల్లి వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. లాక్డౌన్ తెరిచిన తర్వాత ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కరించుకుంటారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు లాభం కోసం ఎదురుచూస్తుంటే చివరి సమయంలో కొంత నిరాశ ఉండవచ్చు. కాబట్టి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ సమయంలో దగ్గరకు వచ్చిన ప్రయోజనాలు దూరమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందిగ్ధత ఉండవచ్చు. సహచరులు, బంధువులు నుంచి నష్టం ఉండవచ్చు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తునానయి. ఏదైనా అడ్డంకి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. ఇది మీ దృష్టిని మరల్చి వేస్తుంది. రోజు ప్రారంభంలో సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గతంలో చేసిన పొరపాటు వల్ల భయం కూడా మనసులోనే ఉంటుంది.

తులా రాశి: ఈ పనిప్రదేశంలో వివిధ సమస్యలు తలెత్తడం వల్ల కొంత కాలం మనస్సు అనుకూలంగా ఉండదు. జీవిత భాగస్వామి లేదా ఇంటి పెద్ద సభ్యుల సహకారంతో సమస్యలు కొంతవరకు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో కొరత ఉంటుంది. ఆర్థిక లాభాలు ఆలస్యమవుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు అనైతిక ప్రవర్తనను మానుకోండి. లేకుంటే వివాదాలు పెరిగే అవకాశముంది. కుటుంబ వాతావరణం అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా సజావుగా నడుస్తుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఏదైనా పాత నిర్ణయాలు తీసుకుంటే వాటిలో కచ్చితంగా విజయాలను అందుకుంటారు. ఇది మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఈ రోజు నూతన పనులు ప్రారంభించకపోతే మంచిది. అవరోధాలు వచ్చే అవకాశముంది. మెరుగైన పని కోసం ఉద్యోగ నిపుణులను ప్రోత్సహిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

మకర రాశి: ఈ రాశి వారు ప్రణాళికా బద్ధంగా పనిచేసి విజయాలను అందుకుంటారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. డబ్బు గురించి ఎక్కువగా చింతిచకండి. ఈ రోజు లేదా రేపు మీకు కచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పని పూర్తి చేయడానికి ప్రయత్నిచండి. కుటుంబ సభ్యుల డిమాండ్లు అసౌకర్యంగా ఉంటాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఏ పని ప్రారంభించినా అందులో విజయాలు సాధిస్తారు. అయితే మీ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థకంగా పుంజుకోలేరు. దీంతో నిరాశకు గురవుతారు. కుటుంబంతో కలసి సంతోషంగా గడుపుతారు. సమయానుకూలంగా అనుసరించాల్సి వుంటుంది.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు దుడుకు స్వభావం కలిగి వుంటారు. దీంతో కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ అవసరానికి తగిన రుణం పొందుతారు. అనవసరం వివాదాలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. సమయమనంతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు సాధిస్తారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story