Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి సంపద, గౌరవం, కీర్తి పెరుగుతుంది.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 1 July 2021 6:19 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 1st July
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పని ప్రదేశంలో మరింత గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రతలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు పనులను సకాలంలో పూర్తి చేసి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేస్తారు. మీ ఇంటి అతిధులు వచ్చే అవకాశం వుంది. దీనితో పని వత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి.

మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దీంతో చాలా ఉత్సాహంగా గడుపుతారు. విలువైన ఆస్తి, పొందాలనే కోరిక బలంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. సాయంత్రం సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఆర్థికంగా మీకు శుభకరంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠ పెరుగుతుంది. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కారణంగా మీరు చింతిస్తారు. మనస్సు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల బాధ్యత కూడా నెరవేరుతుంది. పోటీ రంగంలో మీరు ముందుకు సాగుతారు. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసుకుంటారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మీరు ప్రతి రంగంలోనూ లాభాలు పొందుతారు. బంధువుల నుంచి ఆనందం ఉంటుంది. కుటుంబంలో శుభాకార్యాలు నిర్వహించే అవకాశముంది. ఫలితంగా ఆనందంగా ఉంటారు. సృజనాత్మక పనిలో ఆనందిస్తారు.

తులా రాశి: ఈరాశి వారికి చదువు, పోటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక విజయాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. అలాగే ఈ రోజు మీరు స్పష్టంగా మాట్లాడే విధానం ద్వారా గౌరవం పొందుతారు. సమాజంలో మీకు ఇది గౌరవం ఇస్తుంది. వాతావరణం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు సంపద, గౌరవం, కీర్తి పెరుగుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి. మీకిష్టమైనవారితో మాటలను నియంత్రించడంలో వైఫల్యం ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. సాయంత్రం సమయంలో మీకిష్టమైన వారిని కలవడం సంతోషాన్నిస్తుంది. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయాల్సిరావచ్చు.

ధనస్సు రాశి: ఈ రాశివారు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా వస్తువులను కొనుగోలు చేయడానికి మార్కెట్ కు వెళ్లే అవకాశముంది. గృహోపకరణాలకు డబ్బు ఖర్చవుతుంది. ప్రాపంచిక ఆనందాలను పొందుతారు. కార్యాలయంలో సహోద్యోగులతో ఎలాంటి వివాదమైన మనస్సును పాడుచేస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి: ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఫలితంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశముంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు సంతృప్తి చెందుతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి ఆస్తిని కొనుగోలు చేయడం, విక్రయించడంలో చట్టపరమైన అంశాలను తనిఖీ చేయండి. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

మీన రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో పురుగతి వుంటుంది. తల్లి దండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు తీసుకోవాలి. విద్యార్థులు మానసికంగా ఆనందంగా గడుపుతారు. అందరితో కలసి సంతోషంగా గడుపుతారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story