Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 19 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 19 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు రాశి ఫలాలు

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

సింహం: నూతన పరిచయాలు. బంధువుల నుంచి ఆసక్తికర మైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: పనుల్లో కొన్ని అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం: కొత్త పనులు చేపడతారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే ఛాన్స్‌.

కుంభం: వ్యవహారాలలో నిరుత్సాహం. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో నిరాశ.

మీనం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories