Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 19 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 19 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 19 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | పంచమి - 14:16:08 వరకు తదుపరి షష్ఠి | ధనిష్ఠ నక్షత్రం - 19:40:29 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 07:25:03 నుండి 08:09:25 వరకు | అమృత ఘడియలు 11:51:17 నుండి 12:35:39 వరకు | దుర్ముహూర్తం 06:40:41 నుండి 07:25:03, 07:25:03 నుండి 08:09:25 వరకు | రాహుకాలం 09:27:04 నుండి 10:50:16 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: బంధువుల కలయిక. కుటుంబంలో ఆదరణ. కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.

మిథునం: పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: ఉద్యోగ యత్నాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. పనుల్లో విజయం. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

తుల: రుణబాధలు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. బంధువులను కలుసుకుంటారు. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అప్రయత్న కార్యసిద్ధి. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

ధనుస్సు: చేపట్టిన పనులు ముందుకు సాగవు. నిర్ణయాలు మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వాహనసౌఖ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.

కుంభం: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మీనం: పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories