Daily Horoscope: ఈరోజు మీరోజు!ఈ రాశివారికి కాంట్రాక్టులు లభిస్తాయి

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope 

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం ఉత్తరాయణం| వసంత బుతువు చైత్ర మాసం| సూర్యోదయం : 5.48 | సూర్యాస్తమయం సా.6.11| తిథి శు.సప్తమి సా.గం.06.52వరకు | తదుపరి అష్టమి |నక్షత్రం పునర్వసు రా.2.19 వరకు| తదుపరి పుష‌్యమి|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ప.1.33 నుంచి 3.15 వరకు| దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.17 పున: మ.2.53 నుంచి మ.3.43 వరకు| అమృతఘడియలు రా.11.43ల 1:25వ| కరణం గరజి ఉ.6.25| యోగం సుకర్మ ప.4.02 గం.ల వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మిథునం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బం«ధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తి వృద్ధి. నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా . వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories