Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 18 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 18 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 18 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ రా.09-05 వరకు తదుపరి తదియ | స్వాతి నక్షత్రం మ.12-41 వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: సా.05-55 నుంచి 07-24 వరకు | అమృత ఘడియలు రా.02-52 నుంచి 04-25 వరకు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు రాశి ఫలాలు

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

వృషభం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశాజనకమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగోన్నతి.

సింహం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.

తుల: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

ధనుస్సు: కొత్త ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శ్రమ పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories