Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope 

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి ఫలితాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| సోమవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.10 | సూర్యాస్తమయం సా.6.07| తిథి శు.పంచమి రా.గం.11.24వరకు | తదుపరి షష్టి |నక్షత్రం భరణి ఉ.8.28 వరకు| తదుపరి కృతిక|రాహుకాలం : ప. 1.30 నుంచి 3.00 వరకు| యమగండం 6.00 నుంచి 07.30 వరకు| వర్జ్యం రా.9.48 నుంచి 11.34 వరకు| దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.57 పున: మ.2.56 నుంచి మ.3.44 వరకు| అమృతఘడియలు -| కరణం బవ ఉ.10.19| యోగం వైధృతి ఉ.గం.8.12ల వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవదర్శనాలు.

వృషభరాశి: సన్నిహితులు,మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునరాశి: మిత్రులతో మాటపట్టింపులు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నిరాశ.

కర్కాటకరాశి: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

సింహరాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్యారాశి: రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

తులారాశి: ఆర్థిక భారాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు కొంత నిరుత్సాహం.

వృశ్చికరాశి: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి విముక్తి.

ధనుస్సురాశి: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మకరరాశి: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కుంభరాశి: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనరాశి: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. బంధువులతో సఖ్యత. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.

గుల్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories