Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సానుకూలం

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 18 Jun 2021 5:54 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 18th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు పెద్దలు లేదా అధికారుల సహకారంతో మీకు కావాల్సిన విజయం లభిస్తుంది. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి. సంకల్పంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అది భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్త. హార్డ్ వర్క్ చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో నష్టపోయే అవకాశముంది. అనుజ్ఞవజ్ఞులైన వ్యక్తుల సలహాతో నూతన పనుల్లో పెట్టుబడులు పెట్టకండి. ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం మంచిది.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు తక్కువ ప్రయత్నంతోనే ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రోజు నూతన ప్రణాళికలు మధ్యాహ్నం తర్వాత ఫలవంతమవుతాయి. సామాజిక కారణాల వల్ల సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు కచ్చితమైన విజయం లభిస్తుంది. సాయంత్రం ధనం రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారు మీరనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. ఫలితంగా నేడు మీరు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితులు, బంధువులు సుదీర్ఘ ప్రయాణాలు వేసుకుంటారు. ఇంట్లో ఒకరి మొండి వైఖరి వల్ల ఖర్చులు కూడా అవుతాయి. మీరు మీ ఆస్తి విషయాలను పరిష్కరించుకుంటారు. ఆదాయాలు పెరుగుతాయి. ఇదే సమయంలో మీ ఖర్చులు కూడా ఉంటాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతత పొందుతారు. స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. కార్యాలయంలో డబ్బు సంపాదించడం కోసం మాత్రమే పని చేయవద్దు. పనిలో నైపుణ్యం పెంచుకోండి.

తులా రాశి: ఈ రాశివారికి మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ సహచరులు రిలాక్స్ గా ఉంటారు, మునుపటి కంటే ఎక్కువ పని చేయాలనే కోరికను వ్యక్తం చేస్తారు. ఆర్థిక సమస్యకు పరిష్కారం కూడా బయటకు వస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇందుకోసం మీరు ఏదైనా కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు మీపై పనిభారం పెరగడం వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు కార్యాలయంలో కష్టపడితే ఫలితం ఉంటుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారు. నష్టం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఖర్చులు సమానంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు కుటుంబంలో తలెత్తుతాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రత్యర్థులపై సులభంగా విజయం సాధిస్తారు. కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీరు కష్టించి పనిచేయడం వల్ల కృషి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు అన్ని పనుల్లో ప్రవేశ ద్వారాలు మీ కోసం తెరవబడతాయి. అంతేకాకుండా మీరు మీ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచగలరు.

మకర రాశి: ఈ రాశి వారు మీరు సామాజిక పనుల ద్వారా కొన్ని లక్ష్యాలను సాధిస్తారు. కార్యాలయం వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యతిరేక లింగానికి ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందడం కొనసాగిస్తారు. ఈ రోజు మీరు పెట్టుబడుల పెట్టేందుకు దూరంగా ఉండండి

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు నూతన ఆదాయ వనరుల ద్వారా డబ్బు పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇదే సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. సామాజిక, ధార్మిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. ఈ రోజు మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితుల మద్దతుతో ఏదైనా పెద్ద ప్రాజెక్టును ఖరారు చేయగలరు. మీకిష్టమైనవారిని కలిసే అవకాశముంది. ఫలితంగా ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మీ కోరిక నెరవేర్చడానికి కుటుంబం అండగా ఉంటుంది.


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story