Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 17 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 17 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు రాశి ఫలాలు

మేషం: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు.బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. మిత్రుల నుంచి కీలక స మాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

సింహం: సన్నిహితులతో విభేదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగాఉండవు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

కన్య: ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలువసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆధిక్యం చూపుతారు.

వృశ్చికం: ముఖ్యమైన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: బంధువుల కలయిక. విందువినోదాలు. కొత్త పనులు చేపడతారు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.

Show Full Article
Print Article
Next Story
More Stories