Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 17 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 17 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 17 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి రా.11-29 వరకు తదుపరి విదియ | చిత్త నక్షత్రం మ.02-23 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం: రా.07-35 నుంచి 09-05 వరకు | అమృత ఘడియలు ఉ.08-25 నుంచి 09-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-57 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.19-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-40

ఈరోజు రాశి ఫలాలు

మేషం: అనుకోని ప్రయాణాలు. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మందకొడిగా సాగుతాయి.

వృషభం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తువులు కొంటారు. పరపతి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: శ్రమాధిక్యమే. పనుల్లో కొంత జాప్యం. విద్యార్థులకు కొంత నిరాశ. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్య నిర్ణయాలు వాయిదా. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. ధనవ్యయం.

తుల: కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన ఇంక్రిమెంట్లు.

ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మకరం: వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా. సోదరులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: ఆస్తి వివాదాల నుంచి విముక్తి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల కలయిక. వాహనయోగం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. విందువినోదాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories