Daily Horoscope: ఈరోజు మీరోజు! మిత్రులే శత్రువుల్లా మారతారు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం|బుధవారం| శిశిర ఋతువు ఉత్తరాయణం|పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.11 | సూర్యాస్తమయం సా.6.07| తిథి తిల.చతుర్థి రా.గం.9.15 వరకు| తదుపరి పంచమి |నక్షత్రం భరణి పూర్తి| తదుపరి కృతిక|రాహుకాలం : ప. 12.30 నుంచి 1.30 వరకు| యమగండం ఉ.07.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం సా.4.26 నుంచి 6.06 వరకు| దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.33 వరకు| అమృతఘడియలు రా.03.13| కరణం వనిక్ ఉ.10.21| యోగం ఐంద్రం ఉ.గం.7.30ల |

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు.

వృషభరాశి: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ప్రతిభ వెలుగు చూస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో సఖ్యత. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు చిక్కులు

తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు.

మిథునరాశి: కొత్త విçషయాలు గ్రహిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవాలయాల

సందర్శనం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకరాశి: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపారులకు పెట్టుబడులు అందవు. ఉద్యోగులకు

పనిభారం. కళాకారులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి.

సింహరాశి: కుటుంబసభ్యులతో విరోధాలు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు సామాన్యంగా

ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో మార్పులు.

కన్యారాశి: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ.

తులారాశి: వ్యయప్రయాసలు. ముఖ్యమైన కార్యక్రమాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు

చికాకులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు.

వృశ్చికరాశి: కార్యక్రమాలలో అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది.

ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు సన్మానాలు.

ధనుస్సురాశి: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు శ్రమ

తగ్గుతుంది. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సానుకూలం.

మకరరాశి: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలు వాయిదా. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు స్వల్పలాభాలు.

ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

కుంభరాశి: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు

ఉన్నతస్థితి. కళాకారులకు అవార్డులు.

మీనరాశి: కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు నిరాశ. పారిశ్రామికవేత్తలకు

సమస్యలు

గుల్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories