Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 17 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 17 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | తదియ - 15:19:29 వరకు తదుపరి చవితి | ఉత్తరాషాఢ నక్షత్రం - 19:13:23 వరకు తదుపరి శ్రావణ | వర్జ్యం 10:21:31 నుండి 11:05:54 వరకు | అమృత ఘడియలు 11:50:17 నుండి 12:34:39 వరకు | దుర్ముహూర్తం 10:21:31 నుండి 11:05:54, 14:47:48 నుండి 15:32:11 వరకు | రాహుకాలం 13:35:41 నుండి 14:58:54 వరకు | సూర్యోదయం: ఉ.06-38 | సూర్యాస్తమయం: సా.05-44

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. భూలాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

సింహం: బంధువులతో సత్సంబంధాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కన్య: కొన్ని పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

తుల: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృశ్చికం: చాకచక్యంగా ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఊరట.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

మకరం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆరోగ్యభంగం.

కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Show Full Article
Print Article
Next Story
More Stories