Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఆత్మ విశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 17 April 2021 6:25 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 17th April
X

Todays Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శనివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: కొన్ని క్లిష్టమైన కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి.

వృషభం: పనులు చేసేటపుడు జాగ్రత్తగా వుండాలి. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం పరవా లేదు. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి.

మిథునం: ఉద్యోగాలు, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది.

కర్కాటకం: గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళతారు.

సింహం:ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి

కన్య: ఉద్యోగంలో చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహబలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.

తులా: ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది.

వృశ్చికం: ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. మంచి ఆలోచనను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది.

ధనుస్సు: ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్య పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి.

మకరం: ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులను శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు, సన్నిహితుల సహాయం కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి.

కుంభం: ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది.

మీనం: వ్యాపారపరం చేసే వారికి శుభం కలుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రశంసలు, ప్రోత్సాహాలు ఉంటాయి. అయితే, ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story