Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 16 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 16 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 16 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య రా.01-56 వరకు తదుపరి పాడ్యమి | హస్త నక్షత్రం సా.04-01 వరకు తదుపరి చిత్త | వర్జ్యం: రా.11-28 నుంచి 12-57 వరకు | అమృత ఘడియలు ఉ.10-24 నుంచి 11-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: మ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళం కలిగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు.

మిథునం: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ‡ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరుగవచ్చు. కళాకారులకు కొద్దిపాటి ఒడిదుడుకులు.

తుల: కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం.

వృశ్చికం: నూతన ఉద్యోగలాభం. సంఘంలో మరింత గౌరవం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు: బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం క నిపించదు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారా లు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మకరం: పనులు ముందుకు సాగవు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలించవు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు సద్దుకుంటాయి. విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులకు సత్కారాలు.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆ ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ రోగ్యభంగం. ప్రయాణాల్లో మార్పులు. వ్యా పారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిసా ్తయి. నిరుద్యోగులకు అంచనాలు తప్పుతా యి.

Show Full Article
Print Article
Next Story
More Stories