Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 16 May 2021 7:21 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 16th May
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారికి ఈరోజు పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. విశేషమైన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార యోగం అనుకూలం. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. గృహ వాహన యోగాలు కలుగుతాయి.

వృఫభరాశి: ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నిర్ణయం తీసుకునే సామర్థ్యాల వల్ల మీకు ప్రయోజనముంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. నిరంతర కృషితోనే పైకి వస్తారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీరు చేసిన మనోబలంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర ఖర్చులను నియంత్రించగలుగుతారు. సామాజిక కార్యకలాపాల్లో అంతరాయం కలుగుతుంది. ఆకస్మిక ప్రయోజనాలు అందుకోవడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. మీ కృషి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి వుంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి.

సింహ రాశి: ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతత కొరవడుతుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. అత్తమాల వైపు నుంచి ఆగ్రహ సంకేతాలు వినిపిస్తాయి. లేకుంటే సంబంధంలో చేదు అనుభవం ఉంటుంది. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా మెరుగుదల ఉంటుంది. రాత్రి సమయంలో కుటుంబంలో సరదాగా సమయాన్ని గడుపుతారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కష్టమైన పనులను మనోబలంతో చేయగలుగుతారు. తల్లిదండ్రుల మద్దతు మీ ఆనందాన్ని పొందుతారు. శరీర నొప్పి కారణంగా జీవిత భాగస్వామి నుంచి ఇబ్బంది ఉండవచ్చు. వ్యర్థ వ్యయాలను నివారించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ప్రజలు నిస్సహాయత లేదా స్వార్థంగా భావిస్తారు.

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థకంగా కలసి వస్తుంది. ఈ రోజు మీకు మీ గురువు పట్ల పూర్తి భక్తి, విధేయత ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టాల్సి వస్తే శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాలను పట్టించుకోకండి

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశివారు వ్యాపార వృద్ధి కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించవు. పనుల్లో పెండింగులో ఉంటే అందులో విజయం సాధించడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఒత్తిడికి లోనవకూడదు. ఆనందించే అంశాలు కూడా ఉన్నాయి.

ధనస్సు రాశి: ఈరోజు రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆచారాలపై శుభకరంగా ఉంటుంది. అదృష్టం మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు కడుపులో బాధ వచ్చే అవకాశముంది. ఆహారం విషయంలో సంయమనం పాటించండి. ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి.

మకర రాశి: ఈ రోజు ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. అత్తమామల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నూతన పనుల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కచ్చితంగా చేయండి. వీటివల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ఈ రోజు మీ తెలివితేటలతో వ్యాపారంలో కలసి వస్తుంది. పరిమితమైన, అవసరమైన వస్తువులకు మాత్రమే ఖర్చు చేస్తారు. గందరగోళ పరిస్థితులు కొన్ని ఎదురయ్యే అవకాశం వుంది జాగ్రత్తగా వుండాలి. పాత స్నేహితుడిని కలవడం వల్ల మనస్సుకు ఆనందంగా ఉంటుంది.

మీన రాశి: ఈ రోజు ఈ రాశి రాశి నుంచి 12వ పాదంలో బృహస్పతి ఉండటం వల్ల సంతానానికి సంబంధించిన ఏదైనా వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతోషకరమైన వ్యక్తిత్వం వల్ల ఇతర వ్యక్తులు మీతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవం, ధైర్యాన్ని పెంచుతారు. ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలచుకోగల బుద్ధి నైపుణ్యం లభిస్తుంది.


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story