Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తారు.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 16th June
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్త. వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయానికి లోటుండదు. బంధుమిత్రులు సహాయం అందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. ఖర్చులు అధికంగా చేస్తారు. దీంతో ధన నష్టం జరుగుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేపడతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం నానుతూ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

తులా రాశి: ఈ రాశివారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. మధ్య మధ్య వైద్య ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. బంధువులు, స్నేహితుల్లో కొందరు ఉత్తి పుణ్యానికి మీకు శత్రువులుగా మారతారు. ఉద్యోగం చికాకు కలిగిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపు మార్గం అనుసరిస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు మనో ధైర్యంతో ముందుకు సాగాలి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు శ్రమ మీద సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి శ్రమకు తగ్గఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories