Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి చిన్ననాటి మిత్రులు కలుస్తారు!!

Today Horoscope in Telugu
x

Horoscope

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 16 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | తదియ - 07:47:29 తదుపరి చవితి | శతభిష నక్షత్రం - పూర్తిగా తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం 07:34:25 నుండి 08:19:15 వరకు | అమృత ఘడియలు 12:03:26 నుండి 12:48:17 వరకు | దుర్ముహూర్తం 06:49:35 నుండి 07:34:25, 07:34:25 నుండి 08:19:15 వరకు | రాహుకాలం 09:37:43 నుండి 11:01:47 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ధనవ్యయం. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

తుల: బంధువులతో సఖ్యత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావర ణం.

మీనం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. కార్యసిద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Show Full Article
Print Article
Next Story
More Stories