Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండటం ముఖ్యం.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 16 April 2021 6:23 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 16th April
X

Todays Horoscope:(File Image)

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| శుక్రవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: ఈ రోజు మీరు ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం వుంది. కావున మీరు శ్రద్ధగా పనిచేయాలి. ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కార్యాలయంలో మీ సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. మీపై అధికారులతో వాదించకపోవడం మంచిది. ఈ రోజు మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

వృషభం: ఈ రోజు మీకు అకస్మాత్తుగా అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు రావడానికి మార్గం క్లియర్ అవుతుంది. మీరు ఇంటి జీవితాన్ని సరైనా మార్గంలో గడపాలనుకుంటే మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఉద్యోగంలో ఉన్నవారు బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీరు ఇతరులకు కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మిథునం: మిథున రాశి వారికి ఈ రోజు మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఏదైనా సంక్లిష్టమైన పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇందుకో పెద్ద సమయం పట్టదు. సమస్యల గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు సాయంత్రం సమయంలో మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందుతారు.

కర్కాటకం: ఈ రాశి వారు నేడు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఏదైనా పని భారం నుంచి కొంత విరామం తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీరు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది.

సింహం: ఈ రోజు పనిప్రదేశంలో మీరు ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రజల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. మీ స్నేహశీలి స్వభావంతో సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ఇంటి, కుటుంబం నుంచి గౌరవం లభిస్తుంది. మహిళలు ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్నా వారి పని ప్రశంసించుకుంటారు. స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు.

కన్య: ఈ రాశి వారు నేడు బిజీగా గడుపుతారు. పని ప్రదేశంలో కొన్ని ముఖ్యమైన పనులు మీకు కేటాయించవచ్చు. ఈ రోజు మీ పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక పనులు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

తులా: గతంలో కంటే ఈ రోజు మీకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఉదయం నుంచి ప్రతికూల వాతావరణం ఉంటుంది. రోజంతా గందరగోళంగా ఉంటుంది రోజువారీ పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఎదుగుదల ఉంటుంది. వీలైనంత ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

వృశ్చికం: ఈ రోజు మీరు మీకిష్టంలేని చోటుకు ప్రయాణాలు సాగించే అవకాశముంది. ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీరు మీ మార్గాన్ని సరళంగా ఉంచుకోండి. ఈ సమయంలో నూతన పనులు చేయకండి. ప్రస్తుత పరిస్థితిలో కొత్తగా ఏదైనా ప్రమాదకరమే. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

ధనుస్సు: వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో తెలియని సంస్థల్లో పెట్టుబడులు పెట్టవద్దు. మీరు భారీ నష్టాలను చవిచూసే అవకాశముంది. పాత వ్యాపార మార్గంలో దిగడం మంచిది. మీరు ప్రయోజనం పొందుతారు. ఈ రోజు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి ప్రయత్నించండి. అనవస వ్యర్థవ్యయాలను నివారించండి. ఇది మీ సంపదను పాడుచేస్తుంది.

మకరం: ఈ రోజు మీకు శక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. సేలవు ఉన్నప్పటికీ పని చేయాల్సి వస్తుంది. పనిప్రదేశంలో మిగిలిన వాటితో సమానంగా పనిచేయాలి. అన్ని వస్తువులను మీరు మీ నియంత్రణలో తీసుకోవాల్సి వస్తే మీకు మంచి ఔట్ పుట్ లభిస్తుంది. మీరు సహోద్యోగులను ప్రేమతో చూసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

కుంభం: ఈ రోజు మీరు చాలా అలసటతో ఉంటారు. తీవ్రంగా కష్టపడిన తర్వాతా ఏకాంతంగా గడపాలని భావిస్తారు. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. మీ మానసిక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రస్తుత పరిస్థితిని నియంత్రించుకోవాలి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

మీనం: ఈ రోజు మీకు మీరు డబ్బు సంపాదించడానికి చూస్తుంటే అనేక మార్గాలను అన్వేషిస్తారు. మీ భాగస్వాములతో విభేదాలు ఉండవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కష్టపడి, నిజాయితీతో పనిచేస్తే మంచి జరుగుతుంది. అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story