Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 15 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 15 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు రాశి ఫలాలు


మేషం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: భూములు, వాహనాలు కొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి లాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని అవకాశాలు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. ముఖ్యమైన పనులు వాయిదా. చిత్రమైన సంఘటనలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

కుంభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. పనుల్లో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం..

Show Full Article
Print Article
Next Story
More Stories