Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 15 Jun 2021 6:19 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 15th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారులకు అనుకూలం సమయం. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబందం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కానీ, బాగా ఖర్చవుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగేపనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

తులా రాశి: ఈ రాశివారికి ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్లో నష్టపోతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు పెళ్లి సంబంధం కుదురుతుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story