Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి!

Today Horoscope in Telugu
x

రాశిఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 15 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | విదియ - 08:06:32 తదుపరి తదియ | ధనిష్ఠ నక్షత్రం - పూర్తిగా తదుపరి ధనిష్ట| వర్జ్యం 09:03:54 నుండి 09:48:42 వరకు | అమృత ఘడియలు 12:03:06 నుండి 12:47:55 వరకు | దుర్ముహూర్తం 09:03:54 నుండి 09:48:42, 12:47:55 నుండి 13:32:43 వరకు | రాహుకాలం 11:01:30 నుండి 12:25:30 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: ప్రయాణాలు వాయిదా.. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. సోదరులతో వివాదాలు.

వృషభం: సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి.శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

సింహం: పనులు విజయవంతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య: పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త నిరాశ.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆదరణ.

ధనుస్సు: చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories