Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధిక సమస్యలు తీరుతాయి

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధిక సమస్యలు తీరుతాయి

Sandeep Reddy
Updated on: 15 Oct 2021 10:24 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 15 October 2021
X

Representation Photo

ఈరోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం;శుక్లపక్షం దశమి: రా. 8.20 తదుపరి ఏకాదశి శ్రవణం: మ. 12.36 తదుపరి ధనిష్ఠ వర్జ్యం: సా. 4.30 నుంచి 6.03 వరకు అమృత ఘడియలు: రాత్రి 1.51 నుంచి 3.25 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.02 వరకు తిరిగి మ. 12.09 నుంచి 12.56 వరకు రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.5-37 విజయదశమి, అపరాజితాదేవి పూజ, దుర్గా సరస్వత్యుద్వాసన, శమీపూజ

మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు కోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో వున్న కేసులు పూర్తి అవుతాయి. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ప్రదేశంలో అందరితో కలివిడిగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహంతో ఏ పని చేసిన కచ్చితంగా విజయం లభిస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారం విషయంలో ఒప్పందం కుదుర్చుకునే ముందు దర్యాప్తు చేయడం అవసరం. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు ఏ పని చేసిన కచ్చితంగా విజయం లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత అన్ని పనులు పూర్తవుతాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారం విషయంలో ఒప్పందం కుదుర్చుకునే ముందు దర్యాప్తు చేయడం అవసరం. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఏదైనా మేధోపరమైన పనిలో విజయం సాధించవచ్చు. విజయం కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపార పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి వస్తే కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదోన్నతులు లేదా జీతం పెంపు కూడా ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజు ఎవరికైనా రుణాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

కన్యా రాశి: ఈరాశి వారికి మీరు ప్రతి పనిలో విజయం పొందుతారు. వ్యాపారంలో వృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. గుండె, మనస్సు సమతూల్యత విజయానికి దారితీస్తుంది. మీ సిబ్బందిపై నిఘా ఉంచండి. మీ ప్రవర్తనతో మీరు వారి హృదయాలను గెలుచుకోగలుగుతారు.

తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు ఎదురౌతాయి. మీరు మీ అభిరుచిని కొనసాగించడం గురించి ఆలోచిస్తారు. మీరు కూడా దీని ద్వారా కొంత డబ్బు సంపాదించవచ్చు.స్నేహితుడు రుణం అడిగితే మీ స్థానాన్ని స్పష్టంగా చెప్పండి. భావోద్వేగానికి దూరంగా ఉండండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చిక రాశి : ఈ రాశివారు మీరు ఆఫీసులో చాలా పని చేయాల్సి ఉంటుంది. అనంతరం కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు. మీ ప్రతిభపై నమ్మకాన్ని ఉంచండి. మీకిష్టమైన వారి మానసిక స్థితి ఈ రోజు చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు అధిక వ్యయం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ పనులను ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కరించడం ప్రారంభిస్తే చివరకు మీకు సంతృప్తి లభిస్తుంది. చట్టపరమైన పత్రాలపై సంతకం చేసేముందు జాగ్రత్తగా చదవడం అవసరం. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. రోజులో ఎక్కువ భాగం ఇంటి పనులు నిర్వహించడానికే ఖర్చు చేస్తారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా వున్నప్పటికీ తగిన ధనం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి కార్యాలయంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.పనిలో వచ్చే అడ్డంకులు తొలగించబడతాయి. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు వున్నాయి. ఆర్థిక విషయాలను ఎవ్వరితో చర్చించవద్దు. విజయానికి అవకాశాలు ఎక్కువ. నూతన వ్యక్తులతో సంబంధాలు, పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఒప్పందాన్ని ఖరారు చేసే పనిని కొంతకాలం వాయిదా వేయవచ్చు. కార్యాలయంలో మీకు తగిన బాధ్యతలు ఉంటాయి. తెలివికి సంబంధించి పని ఫలితాలు పొందుతారు.

గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Sandeep Reddy

Sandeep Reddy

Next Story