Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 14 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 14 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మిథునం: విద్యార్థులకు కొత్త ఆశలు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

సింహం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కన్య: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: అరుదైన ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. శ్రమ తప్పదు. నిరుద్యోగులకు ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. గృహయోగం. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories