Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 14 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 14 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 14 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చతుర్దశి మ.1-47 తదుపరి అమావాస్య | స్వాతి నక్షత్రం రా.8-49 తదుపరి విశాఖ

| వర్జ్యం రా.2-02 నుంచి 3-31 వరకు | అమృత ఘడియలు మ.12-37 నుంచి 2-07 వరకు | దుర్ముహూర్తం ఉ.6-08 నుంచి 7-37 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఉద్యోగ ప్రయత్నాలలో కొంత నిరాశ. వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు. పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.. నూతన పరిచయాలు. ధన, వస్తులాభాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన. దైవదర్శనాలు.

మిథునం: బంధువులతో విబేదాలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. దైవచింతన.

కన్య: రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: రుణయత్నాలు. దూరప్రయాణాలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. పనులు వాయిదా.

వృశ్చికం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విలువైన వస్తువులు కొంటారు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు..

ధనుస్సు: విద్యార్థులకు నూతనోత్సాహం. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. చేపట్టిన పనుల్లో జాప్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో నిరాశ. అనారోగ్యం. ధనవ్యయం.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగాలలో బాద్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories