Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి నూతన పరిచయాలు!

Today Horoscope in Telugu
X

రాశి ఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 14 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | పాడ్యమి - 09:03:16 తదుపరి విదియ | శ్రవణ నక్షత్రం - 29:04:47(15వ తేదీ తే.05:04:47) వరకు తదుపరి ధనిష్ట| వర్జ్యం 10:33:13 నుండి 11:17:59 వరకు | అమృత ఘడియలు 12:02:45 నుండి 12:47:32 వరకు | దుర్ముహూర్తం 10:33:13 నుండి 11:17:59, 15:01:50 నుండి 15:46:36 వరకు | రాహుకాలం 13:49:05 నుండి 15:13:02 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం: అనుకోని ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు ముందుకు సాగవు.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: ఇంటాబయటా సమస్యలు. శ్రమాధిక్యం. స్వల్ప అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

తుల: మీ ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. వస్తు, వస్త్రలాభాలు.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మకరం: వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. వృథా ఖర్చులు.

కుంభం: ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు హోదాలు. శుభవార్తలు.

Web TitleDaily horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 14th January
Next Story