Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 13 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 13 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 13 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.10-53 వరకు తదుపరి ద్వాదశి | పునర్వసు నక్షత్రం మ.1-22వరకు తదుపరి పుష్యమి | అమృత ఘడియలు: ఉ.10-54 నుంచి 12-32 వరకు | వర్జ్యం: రా.9-21 నుంచి 10-57 వరకు | దుర్ముహూర్తం: సా.4-25 నుంచి 5-14 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

వృషభం: కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం: కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ఆహ్వానా లు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిసా ్తయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆ ర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. భూలాభాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. ధన్యయం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories