Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 13 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 13 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 13 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి: సా.4-08 తదుపరి చతుర్దశి | చిత్త నక్షత్రం రా.10-28 తదుపరి స్వాతి | వర్జ్యం ఉ.7-32 నుంచి 9-02 వరకు తిరిగి తె.3.41 నుంచి 5.10 వరకు | అమృత ఘడియలు సా.4-30 నుంచి 5-59 వరకు | దుర్ముహూర్తం ఉ.8-21 నుంచి 9-06 వరకు .12-06 నుంచి 12-51 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

వృషభం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

మిథునం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.

కర్కాటకం: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి..

సింహం: నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం..

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.. ఆలయ దర్శనాలు.

కుంభం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన ఉద్యోగయోగం.

Show Full Article
Print Article
Next Story
More Stories