Daily Horoscope: ఈరోజు మీరోజు!ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

డైలీ హోరస్కోప్ 

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు.

శ్రీ శార్వరి నామ సంవత్సరం| మాఘ మాసం| శనివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు| తిథి సర్వేషాం అమావాస్య ప.గం.3.21 వరకు| తదుపరి పాడ్యమి |నక్షత్రం పూర్వాభాద్ర రా.11.43 వరకు| తదుపరి ఉత్తరాభద్ర| వర్జ్యం ఉ.6.13 నుంచి 6.57 వరకు| దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉ. 7.48 వరకు| అమృతఘడియలు ప.3.35 నుంచి| యమగండం మ.1.30 నుంచి 03.00 వరకు| కరణం నాగవం ప.3.07| యోగం సాధ్యం ఉ.గం.7.42 | సూర్యోదయం : 6.13 | సూర్యాస్తమయం సా.6.05| రాహుకాలం : ఉ. 9.00 నుంచి 10.30|


ఈరోజు రాశిఫలాలు

మేషరాశి: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.

వృషభరాశి: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునరాశి: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకరాశి: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

సింహరాశి: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్యారాశి: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తులారాశి: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

వృశ్చికరాశి: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.

ధనుస్సురాశి: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.

మకరరాశి: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కుంభరాశి: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనరాశి: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories