Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Published on: 13 Jun 2021 5:55 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 13th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు మీరు శుభయోగం ఏర్పడుతుంది. కార్యాలయంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ కీర్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు నూతన ప్రణాళికల్లో అమలు చేసే దిశగా ముందుకు సాగాలి. టైంకి ఆహారం తీసుకోవాలి. అలసత్వం వద్దు. చట్టపరమైన వివాదాల్లో విజయం అందుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. నూతన ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులతో ఈ ఆలోచనల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఈ రోజు అంకితభావంతో మీరు పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా వుండాలి. అసంపూర్ణంగా ఉండే పనులు పూర్తి చేసుకుంటారు. కార్యాలయంలో ఆలోచనలు మీకు అనుగుణంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించుకుంటారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. కార్యాలయంలో పై అధికారులు మీ పనిని అడ్డుకోవడానకి ప్రయత్నిస్తారు. మీ నైపుణ్యంతో పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. రాత్రి సమయంలో కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకరితో ఒకరు పరస్ఫరం జాగ్రత్తగా ఉండండి. చుట్టపక్కలవారితో ఘర్షణ పడకుండా ఉండండి. ఈ రోజు మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి చర్చించవచ్చు. అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఇతరులతో మాట్లాడే విధానం, నిజాయితీ మీకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు రోజూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రత్యేక విజయాలను పొందుతారు. రోజంతా లాభావకాశాలు ఉంటాయి. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఈ రోజు కుటుంబంలో ప్రజల్లో పరస్ఫర సహకారం ఉంటుంది. ఈ రోజు మీరుు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు తీసుకురాగలిగితే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యాపార విషయాల్లో కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద లాభాలు ఉంటాయి. ఈ రోజు మీ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈ రోజు కొందరు తమ కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నూతన అవకాశం మీ చుట్టూ ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు వారికి మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వాహనాలను ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి వుంటుంది. ఆహార నియమాలను పాటించాలి.. వ్యాపార పరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలి. కొన్ని ముఖ్యమైన పనుల ఈ రోజు మీ ఇంట్లో ప్రారంభమవుతాయి.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు ఒక శుభవార్త వింటారు. ప్రతి పనిలోనూ చిరుగ్గా వ్యవహరించి విజయం సాధిస్తారు. ప్రతిపనిలోనూ రిస్క్ తో కూడిన పని అనుకూలంగా ఉంటుంది. సహనం, ప్రవర్తనతో మీ సమస్యలను పరిష్కరించుకుంటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story